తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్​ పాలనలో భూములు కబ్జా అవుతున్నాయి: భట్టి

సీఎం కేసీఆర్​ పాలనలో భూములు పూర్తిగా కబ్జాకు గురౌతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం భూస్వాములు, జమీందార్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ఫలితంగా పేద రైతులు ఎప్పటికి పేదవారిగానే మిగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్​ పాలనలో భూములు కబ్జా అతున్నాయి: సీఎల్పీ నేత భట్టి

By

Published : Sep 18, 2019, 4:15 PM IST

Updated : Sep 18, 2019, 5:11 PM IST

తెరాస ప్రభుత్వ హయాంలో భూములు మొత్తం కబ్జాలకు గురౌతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ ప్రక్షాళన పూర్తిగా భూ స్వాములు, జమీందార్లకు అనుకూలంగా జరుగుతోందని శాసన సభలో తెలిపారు. తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతన్న ఎప్పటికి పేదవానిగానే మిగిలిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దున్నేవాడి పేరుమీదే భూమి ఉండాలన్నది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట లక్ష్యమని..అయితే తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది పూర్తిగా అణగదొక్కబడుతోందని మండిపడ్డారు.

కేసీఆర్​ పాలనలో భూములు కబ్జా అవుతున్నాయి: భట్టి
Last Updated : Sep 18, 2019, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details