సామాజిక మాధ్యమాల వినియోగదారులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఒక తప్పుడు పోస్టు, ప్రచారం ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో... ట్విట్టర్ వేదికగా బెంగళూరు ఘటనను ఉదహరించారు. ఒక వ్యక్తి బాధ్యతారహిత్యంగా పోస్టు చేయడం వల్ల... చెలరేగిన అల్లర్లతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 60 మంది పోలీసులు గాయపడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 110 మందిని అరెస్టు చేశారు. అవాస్తవాలు, అమర్యాదలకు పాల్పడే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను సంఘ వ్యతిరేక ప్రవర్తనలకు వేదికగా మార్చొద్దని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కేటీఆర్ - సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా ఉండాలి
సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక బాధ్యతారాహిత్య పోస్టు ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో... బెంగళూరు ఘటనను ట్విట్టర్ వేదికగా ఉదహరించారు.
సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కేటీఆర్