తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి సన్నిధిలో ఇస్రో ఛైర్మన్... చంద్రయాన్-2 నమూనాకు పూజలు - చంద్రయాన్-2

ఇస్రో ఛైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం నిర్వహించనున్న జీఎస్ఎల్​వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

isro chairmen

By

Published : Jul 13, 2019, 11:36 AM IST

ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-2 నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. వారికి పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతిష్ఠాత్మకమైన జీఎస్ఎల్​వీ మార్క్-3 ఎం1 వాహన నౌక ప్రయోగం సోమవారం వేకువజామున నిర్వహించనున్నట్లు శివన్ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు.

శ్రీవారి సన్నిధిలో ఇస్రో ఛైర్మన్

ABOUT THE AUTHOR

...view details