తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్​వో గుర్తింపు

ఏపీ చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వరాలయానికి ఐఎస్​వో గుర్తింపు లభించింది. వివిధ విభాగాల్లో పర్యవేక్షించిన హెచ్​వైఎం సంస్థ ధ్రువీకరణ పత్రాలను అందించింది.

శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్​వో గుర్తింపు
శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్​వో గుర్తింపు

By

Published : Dec 1, 2020, 10:59 PM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి ఆలయానికి హెచ్​వైఎం సంస్థ.. ఐఎస్​వో ధ్రువీకరణ పత్రాలను అందజేసింది. వివిధ విభాగాల్లో పరిశీలించిన అనంతరం ఈ గుర్తింపునిచ్చింది. నాణ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల ఆరోగ్యం, ఆహారం, సమాచార భద్రత, విద్యుత్ నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పర్యవేక్షించారు. ఆలయ ఈవో పెద్దిరాజును సంస్థ ప్రతినిధులు కలిసి ఐఎస్​వో పత్రాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details