వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. వచ్చే నెల చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేశ్ వివరించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
Inter Exams: వచ్చే నెల మొదటి వారంలో ఏపీ ఇంటర్ పరీక్షలు - AP Latest News
వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. వచ్చే నెల చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.
ఇంటర్ పరీక్షలు
1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్