Speed Based Challans in Hyderabad : రాజధాని పరిధి రోడ్లపై పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ఏటా రూ.300 కోట్ల వరకు చలానాలు విధిస్తున్నారు. ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లొచ్చనే దానిపై అవగాహన లేక పలువురు జరిమానాలకు గురవుతున్నారు. ఈ గందరగోళానికి తెరదించాలని పోలీసులు నిర్ణయించారు. రహదారులను మూడు కేటగిరీలుగా విభజించి అయోమయానికి తెరదించాలని చూస్తున్నారు. వేగ ఆధారిత చలానాల పద్ధతి రూపొందించనున్నారు.
ఎంత వెళ్తే అంత చలానా
ప్రస్తుతం 40 కి.మీ. వేగపరిమితి ఉన్న రోడ్డులో 41 కి.మీ. స్పీడుతో వెళ్లినా రూ.1400 జరిమానా పడుతోంది. కొత్త విధానం ప్రకారం 50 కి.మీ. వేగ పరిమితి ఉన్న మార్గంలో 55 కి.మీ. వేగంతో వెళితే మొదటిసారి వదిలేస్తారు. అంతకుమించి వెళితే రూ.100 నుంచి రూ.1400 వరకు జరిమానా వేస్తారు. రెండుసార్లకు మించి వాహనదారుడు అతివేగంగా వెళితే ఛార్జీషీటు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు.
గ్రేటర్ పరిధిలో రహదారులను బట్టి కనిష్ఠంగా 20 కి.మీ. నుంచి గరిష్ఠంగా 60 కి.మీ. వరకు వెళ్లొచ్ఛు ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లొచ్చని తెలిపే బోర్డులు పూర్తిస్థాయిలో లేకపోవడమే సమస్య. వేగ పరిమితి దాటిన వాహనదారులకు రూ.1400 జరిమానా విధిస్తున్నారు. నిర్ధారిత వేగ పరిమితికి మించి ఒక్క కి.మీ. వేగంగా వెళ్లినా జరిమానా పడుతోంది. ఇకపై ఈ అస్పష్టతకు తెరదించాలని ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల సంస్థ ఇంజినీర్లతో ఇటీవల హైదారాబాద్ ట్రాఫిక్ విభాగం చీఫ్ ఏవీ రంగనాథ్ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు.
వేగపరిమితి మూడు విభాగాలు
1. విభాగినులు ఉన్న మార్గాల్లో కారు వేగ పరి మితి 60 కి.మీ., బస్సు, లారీ, ఆటో, బైకులకు 50 కి.మీ.
2. విభాగినులు లేని రోడ్లలో కారుకు 50 కి.మీ వేగపరి మితి. ఇతర వాహనాలకు 40 కి.మీ.