Black Film Removed From Jr.NTR Car: నలుపు తెరలతో ప్రయాణిస్తున్న వాహనాలపై రెండో రోజు ఆదివారం ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకొన్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో చేపట్టిన తనిఖీల్లో పలు వాహనాలను గుర్తించి నలుపు తెరలను, స్టిక్కర్లను తొలగించారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు నలుపు తెర ఉండటంతో వాహనాన్ని ఆపి తెరను తొలగించారు. ఈ సమయంలో డ్రైవరుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు ఉన్నారు.
Jr.NTR Car's Black Film Removed: జూనియర్ ఎన్టీఆర్ కారు బ్లాక్‌ఫిలిం తొలగింపు
Black Film Removed From Jr.NTR Car: హైదరాబాద్ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వరుస ప్రమాదాల అనంతరం నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై దృష్టి పెట్టారు. బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను నిలిపివేసి అక్కడికక్కడే తొలగిస్తున్నారు. ఇలా ఆదివారం రోజున జూబ్లీహిల్స్‌లో తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు ఉన్న నలుపు తెరను తొలగించారు.
J.NTR Car's Black Film Removed
Junior NTR Car's Black Film Removed : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, మేరాజ్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి తొలగించారు. నంబరుప్లేటు సరిగా లేని వాహనాలకు చలానాలు విధించారు. 90 వాహనాలపై కేసులు నమోదుచేసినట్లు ముత్తు తెలిపారు.
ఇవీ చదవండి :