కరోనా వైరస్... ఈ పేరు చెబితే చాలు.. ప్రజలంతా వణికిపోతున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తోన్న ఈ వైరస్‌పై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో సర్కార్ అప్రమత్త చర్యలు తీసుకుంటోంది. ముందస్తుగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశించింది.
బోసిపోయిన భాగ్యనగరం
కొవిడ్-19 వైరస్ ప్రభావం భాగ్యనగరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిత్యం జనంతో సందడిగా ఉండే నగరంలోని పలు ప్రాంతాలు బోసిపోయాయి. ఎప్పుడు రద్దీగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లు లేక వెలవెలబోయాయి. కరోనా వైరస్ భయంతో బయట ఫుడ్ తినాలనిపిస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు కానీ.. బయట అడుగుపెట్టడం లేదు.