ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర హైకోర్టును పంచాయతీ కార్యదర్శి ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ పరిస్థితులను ఎన్నికల కమిషనర్‌కు వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎస్ఈసీకి వివరించాలని.. సంబంధిత పత్రాలను ఎస్ఈసీకి అందజేయాలని ఆదేశించింది.
ఆ ఉద్దేశంతోనే
సమావేశం ఎప్పుడు? ఎక్కడ నిర్వహించాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని హైకోర్టు తెలిపింది. అనంతరం ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ తన నిర్ణయం చెబుతుందని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 29న లిఖిత పూర్వక ఆదేశాలిస్తామంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ను సాకుగా చూపిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై ఇప్పటివరకు ఎటువంటి షెడ్యూల్ ప్రకటించలేదని గత విచారణలో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. షెడ్యూల్ వస్తే కట్టుబడి ఉంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే ..కట్టుబడి ఉంటామని ఎస్ఈసీ న్యాయవాది తెలిపారు.