వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ఒకటి రెండు చోట్ల, మంగళ, బుధవారాలు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటనలో పేర్కొంది.
రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - తెలంగాణ వాతావరణం
రాష్ట్రంలో వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో... రాష్ట్రంలో రానున్న మూడు రోజులూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
telangana rains
ఆదిలాబాద్, కొమురం భీం –ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, గ్రామీణ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఇదీ చదవండి :మంత్రి కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు