శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 44,554 క్యూసెక్కుల నీరు చేరింది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 821.30 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 41.7622 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉద్ధృతితో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - భారీగా వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 821.30 అడుగులుగా ఉంది.
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద