ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన కె.విజయకృష్ణ అనే హెడ్ కానిస్టేబల్ కన్నీటి (police crying) పర్యంతమయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా(viral video) మారింది. 1998లో చంద్రబాబు హయాంలోనే తనకు సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చిందని.. నాటి నుంచి తాను నీతిగా బతుకుతున్నానని చెప్పారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం చేయటానికే తాను సిగ్గుపడుతున్నానని సెల్ఫీ వీడియోలో(police crying for chandrababu) విలపించారు.
వీడియోలో ఏముందంటే...?
నేను కె.విజయకృష్ణ. 1998 బ్యాచ్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లాలో రిటర్న్ టెస్ట్ టాపర్‌గా సెలెక్ట్ అయ్యాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. ఎక్కడా చేయి చాచింది లేదు. నీతి, నిజాయతీతో ఉద్యోగం చేస్తున్నా... నా గురించి ఎవరు, ఎక్కడ తెలుసుకున్నా.. ఇదే చెబుతారు.