హైదరాబాద్‌లో 10వ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన - 2021 ప్రారంభం కానుంది. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ - టీఈఓ ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి 23 వరకు నెక్లెస్‌రోడ్స్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో జాతీయ ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాల రైతులే కాకుండా పట్టణ, నగరవాసులను ఆకర్షించే ఈ గ్రాండ్ నర్సరీ మేళాను ఇవాళ ఉదయం 9.30 గంటలకు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవనుంది. ఈ జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబంగా, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి పేరెన్నికగన్న 125 స్టాళ్లు కొలువు తీరాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి యాజమాన్యాలు, నిర్వాహకులు విచ్చేసి స్టాళ్లను అందంగా అలంకరించారు.
కొవిడ్ నేర్పిన పాఠాలతో...
పట్టణ సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కొవిడ్ నేర్పిన ఆరోగ్యస్తృహ, పాఠాలు దృష్ట్యా విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు, కుండీలు, పనిముట్లకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంటి పంటల సాగు సంబంధించి టెర్రస్ గార్డెనింగ్, ఊర్థ్వ సాగు, హైడ్రోపొనిక్, ల్యాండ్ స్కేపింగ్‌సహా అందమైన దేశీ, విదేశీ పూలమొక్కలు, అలంకరణ మొక్కలు, ఇండోర్, ఔట్‌డోర్ మొక్కలు, అంట్లు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు సరసమైన ధరలకు లభించనున్నందున నగరవాసులు సందర్శించాలని తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఛైర్మన్ ఖలీద్ అహ్మద్ సూచించారు.
నగరవాసుల స్పందన...