తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒడిశా నుంచి ప్రాణవాయువు సరఫరాకు సర్కార్‌ చర్యలు - telangana varthalu

దక్షిణ మధ్య రైల్వే ప్రాణవాయువు సరఫరాలో కీలకపాత్ర పోషిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను చేరవేసిందని రైల్వేశాఖ పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు ఆరు, ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ప్రాణవాయువు అందించింది. రెండు ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఆయా రాష్ట్రాలకు కావాల్సిన ఆక్సిజన్ సరఫరాను కొనసాగిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

oxygen
ఒడిశా నుంచి ప్రాణవాయువు సరఫరాకు సర్కార్‌ చర్యలు

By

Published : May 17, 2021, 4:08 AM IST

ఒడిశా నుంచి ప్రాణవాయువు సరఫరాకు సర్కార్‌ చర్యలు

కరోనా రెండో దశలో చాలామందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. అందుకే తెలుగురాష్ట్రాలు ప్రాణవాయువు నిల్వలపై దృష్టిసారించాయి. వాయు, రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా ఖాళీ ఆక్సిజన్ కంటెయినర్లను చేరవేసి తిరిగి వాటిలో ఆక్సిజన్​ను నింపుకుని రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను తరలిస్తున్నారు. రాష్ట్రానికి ఆరవ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌లోని భరత్ నగర్ యార్డుకు చేరుకుంది. 120 టన్నుల ద్రవరూప మెడికల్‌ ఆక్సిజన్‌ ఆరు ట్యాంకర్లలో ఒడిశా రాష్ట్రం కలింనగర్‌ నుంచి వచ్చింది.

ఆక్సిజన్​ రవాణాకు చర్యలు

భారతీయ రైల్వే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను గ్రీన్‌ కారిడార్లను ఏర్పాటుచేసి గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో రెండు రైళ్లను నడుపుతోంది. వివిధ రాష్ట్రాలకు క్రయోజనిక్‌ కార్గో ద్వారా ఆక్సిజన్‌ రవాణాకు తగిన చర్యలు తీసుకున్నామని రైల్వేశాఖ వెల్లడించింది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తూ రవాణాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఏడో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 55.42 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు నాలుగు ఖాళీ కంటెయినర్లతో ఒడిశాకు బయలుదేరి వెళ్లింది.

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: నేడు రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details