పర్యావరణానికి అవరోధం కలిగిస్తున్న వాటిల్లో ప్లాస్టిక్ కాలుష్యం అత్యంత ప్రమాదకరమయ్యింది.1930వ సంవత్సరంలో ఇది బయటపడింది.... అంటూ ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెంకు చెందిన నాలుగేళ్ల లంకా వికాస్ చెప్పేస్తున్నాడు. చమురు సంక్షోభానికి ప్లాస్టిక్ ఎలా కారణమయ్యిందో వివరిస్తున్నాడు. ప్లాస్టిక్ అనేది భావి తరాలకు పొంచి ఉన్న పెను ముప్పంటూ ముద్దుముద్దుగా చెప్తున్న ఈ బుడతడి మాటలు మీరూ వినేయండి.
ఈ బుడ్డోడు మహా మేధావి..!
వాటర్ బాటిల్ భూమిలో కలవటానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో మీకు తెలుసా... ఆ బుడతడికి తెలుసు. చమురు సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా... ఆ బుడ్డోడు చకాచకా చెప్పేస్తాడు. ఇన్ని విషయాలు తెలిసిన ఆ చిన్నిబాబు వయస్సు నాలుగేళ్లే అంటే నమ్మశక్యం కావటం లేదు కదూ..!
ఈ బుడ్డోడు మహా మేధావి..!