ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందని... సుస్థిరమైన ప్రభుత్వం, సుపరిపాలన, మేలైన శాంతి భద్రతలు నెలకొనడంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
17,921 పరిశ్రమలకు అనుమతులు
టీఎస్ ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 17,921 పరిశ్రమలకు అనుమతులు వచ్చాయని వెల్లడించారు. ఐటీ రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతోందని... 1,500లకు పైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలో హైదరాబాద్ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించారు. దేశంలో ఐటీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడుతున్న ప్రతి 10 ఉద్యోగాల్లో 3 తెలంగాణ ఐటీ రంగమే కల్పిస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఏకైక రాష్ట్రం తెలంగాణ