railway ticket charges hike : దసరా ప్రత్యేకం.. టికెట్లపై అదనపు ఛార్జీల బాదుడు - తిరుపతి-పూర్ణకు ఆరు ప్రత్యేక రైళ్లు
కరోనాతో ఆదాయం తగ్గి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారు అవస్థలు పడకుండా రవాణా సౌకర్యం కల్పించాల్సిన రైల్వే శాఖ పండుగ ప్రత్యేకం అంటూ దసరాను సొమ్ము(railway ticket charges hike) చేసుకుంటోంది. ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేకం పేరుతో ప్రయాణికులపై అదనపు ఛార్జీల(railway ticket charges hike) భారం వేస్తోంది.
extra charges on railway ticket
By
Published : Oct 9, 2021, 11:02 AM IST
దసరా పండుగ రద్దీని రైల్వే శాఖ సొమ్ము చేసుకుంటోంది. పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేకం పేరుతో ప్రయాణికులపై వంద నుంచి రెండు వందల శాతం వరకు అదనంగా ఛార్జీల(railway ticket charges hike) భారం వేస్తోంది. టికెట్ల ధర పెంపుతో బోగి రకం, దూరం బట్టి ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 నుంచి రూ.700, ఆ పైన అదనపు భారం పడుతోంది.
తిరుపతి-పూర్ణ.. ప్రత్యేక రైళ్లు..
మరోవైపు.. దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. తిరుపతి-పూర్ణల మధ్య ఆరు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. పూర్ణ జంక్షన్ నుంచి ఈ నెల 11, 18, 25న మూడు ట్రైన్లు... తిరుపతి నుంచి పూర్ణ జంక్షన్‌కు ఈనెల 12, 19, 26న ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
కరోనాతో ఆదాయాలు తగ్గి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారికి వ్యయప్రయాసలు లేకుండా రవాణా సౌకర్యం కల్పించాల్సిన రైల్వే శాఖ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్, ఒడిశా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్, ఇతర నగరాలకు వచ్చినవారు పండుగకు వెళ్తుండటంతో రైలు టికెట్ల(railway ticket charges hike)కు గిరాకీ పెరిగింది.
ఈ నెల 14న హైదరాబాద్-విశాఖపట్నం గరీబ్ రథ్ రైలులో టికెట్లు(railway ticket charges hike) అయిపోయాయి. టికెట్లు తీసుకుని మరో 142 మంది వెయిటింగ్ లిస్ట్ (నిరీక్షణ జాబితా)లో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లడానికి 16 రైళ్లు ఉండగా.. రెండు, మూడింట్లో మాత్రమే కొన్ని టికెట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మంచిర్యాల, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రెట్టింపు ఛార్జీలు(railway ticket charges hike) భరించాల్సి వస్తోంది.