1. బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దీ ఉన్న ప్రాంతాల్లో ముందస్తు టోకెన్లు జారీ చేసి ఇబ్బంది లేకుండా సబ్ రిజిస్ట్రార్‌లు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. యాసంగిపై సమీక్ష
యాసంగి పంట కాలంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... ఉన్నతాధికారులతో సమీక్షించారు. పంటల కొనుగోళ్లు సహా తాజా యాసంగి పంటల సాగు సరళి, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానం, రసాయన ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు వంటి అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సర్కారు అప్రమత్తం
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సీసీఎస్ దాడులు
హైదరాబాద్ బేగంపేట పిన్ ప్రింట్ టెక్నాలజీ లోన్ యాప్ కాల్‌సెంటర్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. గురుగావ్ కేంద్రంగా కాల్ సెంటర్ కొనసాగుతున్నట్లు గుర్తించారు. బేగంపేట, పంజాగుట్ట, మరో ప్రాంతంలోని పిన్ ప్రింట్ కాల్ సెంటర్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ
ఐరోపా దేశాలను కలవరపెడుతోన్న కొత్తరకం కరోనా వైరస్ పట్ల మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు 15రోజుల పాటు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది ఠాక్రే ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.