1.కరోనా కట్టడి కోసం
రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం... అటు పరీక్షలు, ఇటు టీకా పంపిణీ పెంచేసింది. 24 గంటల వ్యవధిలో లక్ష పరీక్షలు నిర్వహించగా... లక్ష టీకాలు అందించింది. కొత్తగా 2,478 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా... ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నిర్ధరించిన కేసుల్లో ఇదే అత్యధికం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.మార్గదర్శకాలు ఖరారు
రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాసంస్థల నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.ఎక్కడికక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు
కొవిడ్ నిర్ధారణలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో.. ఆ మేరకు వైద్యఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. మారుమూల ప్రాంతంలో నమూనాలు స్వీకరించి, సుదూర ప్రాంతంలో ఉన్న ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌కు తరలించడం కష్టమని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో గ్రామీణుల చెంతకే పరీక్షలను తీసుకెళ్లాలన్నది లక్ష్యం. దీనికోసం జిల్లా ఆసుపత్రుల్లో ల్యాబొరేటరీలను నెలకొల్పాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.సాయానికి లక్ష మంది దూరం?
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ బడులు తెరిచే వరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కనీసం లక్ష మంది ఉపాధ్యాయులు అందుకు దూరమయ్యే అవకాశముంది. 3లక్షల మందికి ఉపాధ్యాయులను ఆదుకోవాలని ట్రస్మా కోరగా... డైస్ లెక్కల్లోనేమో 1.18 లక్షల మంది ఉపాధ్యాయులే ఉన్నట్లు నమోదవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.నాలుగో విడత
బంగాల్ శాసనసభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ప్రజలు. ఇప్పటికే పలు కేంద్రాల ముందు బారులుతీరారు ప్రజలు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.