తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫొటోలు ఎందుకు... లాభాలు కావాలి: సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్గో బస్సులపై సీఎం కేసీఆర్‌ ఫొటో వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టారు. తన ఫొటో ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సీఎం ఫొటో కార్గో బస్సులపై వాడొద్దంటూ సంస్థ ఎండీకి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నోట్​ పంపారు.

cm kcr about tsrtc cargo bus
cm kcr about tsrtc cargo bus

By

Published : Feb 4, 2020, 6:59 PM IST

Updated : Feb 4, 2020, 9:15 PM IST

ఫొటోలు ఎందుకు... లాభాలు కావాలి: సీఎం కేసీఆర్

సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందిండచం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం మాత్రమే తన లక్ష్యం అన్నారు.

బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సీఎం స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండీకి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్ రెడ్డి నోట్ పంపారు. కార్గో బస్సులపై ముఖ్యమంత్రి ఫొటో వేయరాదని స్పష్టంగా సూచించారు.

ఇదీ చూడండి:సర్కారీ శాఖల సరకు రవాణాకు ఆర్టీసీ కార్గో

Last Updated : Feb 4, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details