కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ బిల్లుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు చేపట్టిన ఆందోళన కారణంగా పలుచోట్ల రోగులు ఇబ్బందులు పడ్డారు. ఐఎంఏ రాష్ట్రంలో అతిపెద్ద ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లోనూ వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే ఓపీ సేవలను నిలిపివేశారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నిరసనలు కొనసాగాయి. గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కేవలం గంటసేపు మాత్రమే విధులు బహిష్కరించగా... నిమ్స్‌లో పూర్తిగా ఓపీ సేవలను నిలిపివేయటంతో రోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉదయం నుంచే ఓపీ సేవలు బంద్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు విధులు బహిష్కరించారు. నిమ్స్ ఆస్పత్రికి కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. బంద్ కారణంగా వారంతా తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ పరిస్థితేంటని వాపోయారు.
బంద్ సాకుతో.. విధులకు గైర్హాజరు