నేటి నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10గంటల మధ్య బయటకొచ్చే వాళ్లకు ఎలాంటి పాసులు అవసరం లేదని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు రావాలంటే కచ్చితంగా పాసు ఉండాలని స్పష్టం చేశారు. ఆంక్షల సమయంలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు: డీజీపీ
క్షేత్ర స్థాయిలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలయ్యేలా పోలీసులు పనిచేస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ అమలుపై ఇప్పటికే సీపీలు, జిల్లా ఎస్పీలకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు.
తెలంగాణ డీజీపీ