"అభివృద్ధికి మారుపేరు తెలంగాణ" కొత్తరాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందుతుంటే... ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సభలో ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక, సర్వే, గణాంకాల శాఖల పద్దులపై చర్చ జరుగుతుండగా శ్రీధర్‌బాబు పలు అంశాలు లేవనెత్తారు. దీనికి కేటీఆర్ సమాధానమిస్తూ అభివృద్ధికి మారుపేరుగా ఒకప్పుడు గుజరాత్‌ను చెప్పేవాళ్లని కానీ... ప్రస్తుతం మన రాష్ట్రంను చూపిస్తున్నారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని.. ఇక్కడి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, రైతుబంధు, ఆసరా పింఛన్ వంటి పథకాల పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వం మరోపేరుతో అమలు చేస్తోందని కేటీఆర్ తెలిపారు.