రాచకొండ షీ బృందాల పోలీసులకు ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. భద్రమైన నగరం అనే ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులతో షీ బృందాల పోలీసులకు ద్విచక్రవాహనాలు ఇచ్చినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కమిషనరేట్‌కు మొత్తం 16 వాహనాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
షీ బృందాలకు స్కూటీలు అందించిన సీపీ మహేశ్ భగవత్ - she team police news
రాచకొండ కమిషనరేట్‌లోని షీ టీవ్ సిబ్బందికి ద్విచక్రవాహనాలను సీపీ మహేశ్‌భగవత్ అందజేశారు. కమిషనరేట్ నుంచి మరో అంబులెన్స్ సర్వీస్‌ను కూడా సీపీ ప్రారంభించారు.
cp mahesh bhagwat started scooties to she team police
షీ బృందాల సిబ్బందికి ద్విచక్ర వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయని సీపీ వివరించారు. ఘటనా స్థలానికి వేగంగా చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కమిషనరేట్ తరఫున ఓ అంబులెన్స్‌ను కూడా సీపీ ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. కొవిడ్ రహిత రోగులకు అంబులెన్స్ సేవలు అవసరమైతే 9490617234 నెంబర్‌కు ఫోన్ చేయాలని కమిషనర్ సూచించారు.