తెలంగాణలో మరో 493 కరోనా కేసులు, 4 మరణాలు - corona cases in telangana
తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మోర 493 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి నలుగురు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. . తాజాగా మరో 493 మంది వైరస్ బారిన పడగా.. నలుగురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 157 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,684 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,616 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 138 మంది వైరస్ బారిన పడ్డారు. వారం నుంచి గ్రేటర్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాడు 56 వేల 464 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.
- ఇదీ చదవండి :కరోనానూ వదలని కేటుగాళ్లు