తెలంగాణ

telangana

ETV Bharat / city

'కంటోన్మెంట్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యం'

సికింద్రాబాద్​ తాడ్​బండ్​లో నిర్వహించనున్న భాజపా సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం పట్ల కంటోన్మెంట్​ సభ్యుడు రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. తెరాస ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా కంటోన్మెంట్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు.

contonment board member fire ob trs government
contonment board member fire ob trs government

By

Published : Nov 8, 2020, 10:41 AM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని బోర్డు సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. తాడ్​బండ్ వద్ద జరగనున్న భాజపా చేరికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కీలక నేతలు భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు రామకృష్ణ తెలిపారు. సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, భాజపా నాయకుల హోర్డింగులకు జరిమానాలు విధించడం పట్ల మండిపడ్డారు.

తెరాస ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా కంటోన్మెంట్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేస్తున్న కుటిల రాజకీయాల కారణంగా తెరాస పార్టీ భ్రష్టుపట్టి పోయిందని విమర్శించారు. కంటోన్మెంటుకు నిధులు తీసుకురావడం... అభివృద్ధి చేయటం... కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా వల్లనే సాధ్యపడుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు లైంగిక దాడి

ABOUT THE AUTHOR

...view details