కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మాట్లాడొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం ఆవేదనతోనే కుంతియా, ఉత్తమ్‌కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడినట్లు స్పష్టం చేశారు. జగ్గారెడ్డి, హనుమంతరావు, కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు వారి వారి నాయకులకే పీసీసీ చీఫ్ రావాలని కోరుకోవడం సహజమన్నారు.
రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి
అధిష్ఠానం బలమైన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించుతామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై స్పందించారు.
KOMATI REDDY RAJAGOPAL REDDY
పీసీసీ అధ్యక్ష పదవి కోసమే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లలేదన్నారు. ఈ ఘటనకు, పదవికి సంబంధం లేదన్నారు. హీరో కావడం కోసమే 111జీవో మీద పోరాటం చేయలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన ప్రభుత్వం