COMMON ENTRANCE TESTS: ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల - ED.CET
20:28 July 09
ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు(cet's dates) విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల(Notification release) చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు జేఎన్‌టీయూ-కాకినాడ ఆధ్వర్యంలో ఈఏపీ సెట్(EAPCET) నిర్వహించనున్నారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ను ఆగస్టు 19 నుంచి 25వరకు కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ (ఏయూ) ను సెప్టెంబర్ 17, 18 తేదీల్లో, సెప్టెంబర్ 19న ఈసెట్(జేఎన్‌టీయూ అనంతపురం), సెప్టెంబర్ 22న లాసెట్(ఎస్వీయూ), సెప్టెంబర్ 21న ఎడ్‌సెట్(ఏయూ), సెప్టెంబర్ 27నుంచి 30 వరకు పీజీఈసెట్ (ఎస్‌వీయూ) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.