కరోనా వైరస్ వ్యాప్తి గురించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు పెంచొద్దని హితవు పలికారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా, ఊర్ల పేర్లు రాసి ప్రజల్లో లేని భయాన్ని సృష్టించవద్దన్నారు.
ప్రభుత్వమంటే ఏంటో రుచి చూపిస్తం: కేసీఆర్
"కొందరు అతిగాళ్లు సోషల్ మీడియాలో వాళ్ల ఇష్టమన్నట్లుగా ప్రచారం చేస్తున్నరు. ఎటువంటి పరిస్థితుల్లో వారిపై చాలా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటం. మమ్మల్ని ఎవరేం చేయలేరనుకుంటున్నరు. ప్రభుత్వం అంటే ఏంటో.. చట్టమంటే ఏంటో రుచి చూపిస్తం.." -కేసీఆర్
ప్రభుత్వమంటే ఎంటో రుచి చూపిస్తం: కేసీఆర్