కరోనా వల్ల రాష్ట్రంపై సుమారు లక్ష కోట్ల భారం పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని విషయాల్లో కొంత ఆలస్యమైన సంగతి నిజమేనని సభలో సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో సభలోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఉద్యోగులకు గుడ్న్యూస్..సభలోనే పీఆర్సీ ప్రకటిస్తానన్న కేసీఆర్
రాష్ట్ర ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఆలస్యమైన పీఆర్సీని... రెండుమూడు రోజుల్లో తానే స్వయంగా ప్రకటిస్తానని అసెంబ్లీలో స్పష్టం చేశారు.
cm kcr comments about prc announcement in two three days
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిపోయిన సందర్భంగా... సభలో తానే స్వయంగా పీఆర్సీ ప్రకటిస్తానని తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా... దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు.