తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్

ఏపీలో తాడేపల్లి కరోనా పాజిటివ్​ కేసు ఎఫెక్ట్​ సీఎం నివాసం వరకూ చేరింది. ముఖ్యమంత్రి నివాసం సైతం బఫర్​జోన్​లోకి వెళ్లినట్లు అధికారులు గూగుల్​ మ్యాప్​ ద్వారా గుర్తించారు.

chief-minister-jagans-residence-in-buffer-zone-at-thadepalli-in-guntur
ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్

By

Published : Apr 16, 2020, 7:06 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీ ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం బఫర్​జోన్​లోకి వెళ్లింది. నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు రెడ్​జోన్​ అని, మూడు కిలోమీటర్ల పరిధిని క్లస్టర్ కంటైన్​మెంట్ జోన్​గా, ఏడు కిలోమీటర్ల పరిధిని బఫర్​జోన్​గా అధికారులు ప్రకటించారు. పాజిటివ్ కేసు నమోదైన తాడేపల్లి పట్టణంలోని డోలాస్​నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి నివాసం ఏడు కిలోమీటర్ల పరిధిలోపల ఉన్నట్లు గూగుల్​ మ్యాప్​ ద్వారా అధికారులు గుర్తించారు. పాజిటివ్ కేసు నమోదైన డోలాస్​ ప్రాతం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో 3,982 గృహలతో పాటు 11,180 జనాభా రెడ్​జోన్​లోకి వస్తున్నట్లు వెల్లడించారు.

గుంటూరు జిల్లావ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 122కి చేరుకుంది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది.

ఇదీ చదవండి:క్వారంటైన్ పూర్తి చేసుకున్న పేదలకు ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details