అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో 'కండోమ్స్' అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇది ఆ బోర్డు పరిధిలోని 600స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుంది. ఈ మేరకు అన్ని విద్యా సంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
సెక్స్ ఎడ్యుకేషన్ కోసమే..
2020 డిసెంబర్లోనే సీపీఎస్ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఇక నుంచి ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000వరకు కండోమ్స్ అందుబాటులో ఉంటాయి. షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్స్‌ను సప్లై చేస్తారు. ఒకవేళ కండోమ్స్ అయిపోతే ఆరోగ్య శాఖకు ప్రధానోపాధ్యాయులు సమాచారమిచ్చి రీఫిల్ చేసుకోవచ్చు.
"ఆరోగ్యపరంగా సరైన నిర్ణయాలు తీసుకునే హక్కు యువతకు ఉంది. నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలి. వాటినే మేము అందిస్తున్నాము. కండోమ్స్ కావాలి అనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నాము. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయి. వాటిని రాకుండా చూసుకోవడం కోసమే ఈ చర్యలు. దీనిపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అయినప్పటికీ సమాజం మారింది అని నేను విశ్వసిస్తున్నాను."
-- కన్నెత్ ఫాక్స్, సీపీఎస్ డాక్టర్.
పాఠాలు కూడా..