తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతివైపే ఏపీ ప్రజల మొగ్గు... వెబ్‌సైట్‌ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు..!

'ఏపీ ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైకా రాజధానిగా కోరుకుంటున్నారా?' అనే ప్రశ్నను సంధిస్తూ... తెదేపా అధినేత చంద్రబాబు ఓ ప్రత్యేక వెబ్​సైట్​ను తీసుకొచ్చారు. అయితే ఆ వెబ్​సైట్లో 3 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

chandrababu-takes-public-opinion-on-amaravathi-issue-with-a-website
అమరావతివైపే ఏపీ ప్రజల మొగ్గు... వెబ్‌సైట్‌ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు..!

By

Published : Aug 26, 2020, 2:35 PM IST

' ఏపీ ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా?' అనే ప్రశ్నను సంధిస్తూ... తెదేపా అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన వెబ్ సైట్​లో 3లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 93శాతం మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని స్పష్టం చేశారు.

అమరావతివైపే ఏపీ ప్రజల మొగ్గు... వెబ్‌సైట్‌ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరుదామని తాను విసిరిన సవాల్​ను ఏపీ ప్రభుత్వం స్వీకరించకపోవటంతో... ఆయన http://www.apwithamaravati.com/ వెబ్​సైట్​ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. ఈ వెబ్​సైట్ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండని ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే 36 గంటల వ్యవధిలో 3లక్షల మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఓటింగ్​లో పాల్గొన్నారు.

ఇవీచూడండి:చైనాకు చెక్​: లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

ABOUT THE AUTHOR

...view details