తెలంగాణ

telangana

ETV Bharat / city

అపెక్స్​ కౌన్సిల్ సమావేశం​ వాయిదా కోరడమేంటి..: చాడ - chada venkat reddy speaks on pothireddypadu projecr

జలవివాదాల పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్​ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం నిర్వహిస్తామంటే.. సీఎం కేసీఆర్​ వాయిదా కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

chada venkat reddy
అపెక్స్​ కౌన్సిల్ సమావేశం​ వాయిదా కోరడమేంటి..: చాడ

By

Published : Aug 3, 2020, 5:03 PM IST

జల వివాదాల పరిష్కార విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం నిర్వహిస్తామంటే.. సీఎం కేసీఆర్​ వాయిదా కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సమాయత్తం అవుతుంటే.. కేసీఆర్​ మాత్రం తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే.. రంగారెడ్డి, మహబూబ్​నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో అలమట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషిచేయాలని కోరారు.

అపెక్స్​ కౌన్సిల్ సమావేశం​ వాయిదా కోరడమేంటి..: చాడ

ఇవీచూడండి:పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details