తెలంగాణ

telangana

ETV Bharat / city

Case on Nara Lokesh: నారా లోకేశ్​పై హత్యాయత్నం కేసు నమోదు!

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Case on Nara Lokesh)పై ఏపీ మంగళగిరి(mangalagiri) పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Nara Lokesh
నారా లోకేశ్

By

Published : Oct 20, 2021, 3:09 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(nara lokesh)పై మంగళగిరి(mangalagiri) పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారనే అభియోగంపై ఈ కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఏ1గా లోకేశ్​, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్‌ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

లోకేశ్​పై హత్యాయత్నం కేసు

రేపటి నుంచి చంద్రబాబు దీక్ష...

ఏపీలో తెదేపా కార్యాలయాలపై దాడి(attack on tdp offices)కి నిరసనగా దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) నిర్ణయించారు. రేపు ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు 36 గంటల పాటు ఆయన దీక్ష చేపట్టనున్నారు. మంగళవారం జరిగిన పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెదేపా కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నట్లు సమాచారం.

అమిత్ షా ను కలవనున్న చంద్రబాబు..!

శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(union home minister amit shah)ను కలిసేందుకు.. చంద్రబాబు సమయం కోరారు. తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులపై.. అమిత్​ షాను కలిసి తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, గవర్నర్‌ విశ్వభూషణ్‌కు.. చంద్రబాబు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా కార్యాలయాలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. వైకాపా మూకలు తెదేపా కార్యాలయాలపై దాడులకు దిగి, కార్యకర్తలను భౌతికంగా గాయపరిచాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయని వివరించారు. ఈ దాడులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే చేసినవేనని తెలిపారు. దాడి ఘటనను పరిశీలిస్తామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అమిత్‌షా సూచించారని తెలిపారు. తెదేపా కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తామని హామీనిచ్చినట్లు తెదేపా వర్గాలు వెల్లడించాయి.

Case on Nara Lokesh: నారా లోకేశ్​పై హత్యాయత్నం కేసు నమోదు!

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details