దేశహితం కోసం మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తే ప్రతిక్షాలు గగ్గోలు పెడుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. మతం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ఈ చట్టంపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో భాజపా ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రవీంద్రనాయక్, చంద్రవదన్ హాజరయ్యారు.
సీఏఏపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం: లక్ష్మణ్
దేశ పౌరులందరికీ దోహదపడే చట్టాలను తీసుకువచ్చేందుకు మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. భాజపా నేతలందరికీ దేశం ముందు ఆ తరవాతే పార్టీ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
laxman