వరి వేయొద్దని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాసిచ్చారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. తాను ఇప్పుటే కేంద్ర మంత్రితో మాట్లాడానని చెప్పారు. కేంద్రం వరి కొనలేదని ఎప్పుడు చెప్పలేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని సీఎం కేసీఆర్ను కోరారు. కేసీఆర్ చెప్పినవి ఇప్పటి వరకు ఏం అమలుకాలేదని ఆరోపించారు.
దళిత బంధు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్, నిరుద్యోగ భృతిపై వంటి హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేంద్రంపై సీఎం కేసీఆర్ నిందలు వేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు.. ఆయన మెడలు వంచుతామన్నారు.