లోక్ సభ ఉపఎన్నికలో భాజపా - జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరుతూ తిరుపతిలో ఇరు పార్టీల నాయకులు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. అన్నారావు సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకూ సాగిన ర్యాలీలో ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, ఎంపీ టీజీ వెంకటేశ్, తెలంగాణ భాజపా నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
'దుబ్బాక ఫలితాన్నే తిరుపతిలో రిపీట్ చేస్తాం'
ప్రాంతీయ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రత్నప్రభకు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. దుబ్బాక ఫలితాన్నే తిరుపతిలో రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక
జనసేన తరపున పసుపులేటి హరిప్రసాద్.. కూటమి అభ్యర్థి రత్నప్రభకు ఓటు వేయ్యాలని ప్రజలను అభ్యర్థించారు. దుబ్బాక ఫలితాన్ని తిరుపతిలోనూ పునరావృతం చేస్తామని రఘునందన్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా విస్మరించాయన్న ఆయన.. దుబ్బాక ఎన్నికలో వైకాపా తరహాలోనే తెరాస మెజార్టీ గురించి సవాళ్లు విసిరి భంగపడిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:ఇద్దరి లోకం ఒకటే కావాలంటే.. ఇవి పాటించండి!