గ్రేటర్ ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్‌పై... హైదరాబాద్‌లోని హోటల్ హరిత ప్లాజాలో భాజపా కార్పొరేటర్లు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉన్న పోలీసు బలగాలు.. వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం
జీహెచ్ఎంసీ ఫలితాలపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రగతి భవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్లు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం
గ్రేటర్ ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఎస్ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ఇటీవలే గవర్నర్‌కు భాజాపా ఫిర్యాదు చేసింది.
Last Updated : Jan 5, 2021, 1:28 PM IST