పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు గవర్నర్ తమిళిసై సహా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మరో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ కవిత, సినీగేయ రచయిత చంద్రబోస్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లికి గవర్నర్ సహా ప్రముఖుల శుభాకాంక్షలు - మంత్రి సత్యవతి రాఠోడ్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని... మొక్కలు నాటాలని కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి సూచించారు.
మంత్రి ఎర్రబెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
తెదేపా అధినేత చంద్రబాబు నాయడు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలు జరపవద్దన్న దయాకర్ రావు... కార్యకర్తలు, అభిమానులు మొక్కలు నాటాలని కోరారు.
ఇవీ చూడండి: రైతుల అకుంఠిత స్ఫూర్తికి సెల్యూట్: చంద్రబాబు