హుజూర్ నగర్ ఎన్నికల్లో తెరాసను ఓడించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెరాస ప్రభుత్వం ఆరేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు లేకుండా అటు రాజకీయ నాయకులను, మీడియాను, ప్రజలను బెదిరిస్తున్నారని... ఇది ఒక్క కేసీఆర్‌కే చెందిందని భట్టి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మునిగి పోయే నావ అని అన్న కేటీఆర్ ముందు తమ పార్టీ పరిస్థితిని గమనించుకోవాలని ఎద్దేవా చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఏకంగా మంత్రులు రంగంలోకి దిగడం సిగ్గుచేటన్నారు.
ప్రశ్నించే గొంతుకలకు తెరాస బెదిరింపులు: సీఎల్పీ నేత భట్టి - ప్రశ్నించే గొంతు లేకుండా బెదిరిస్తున్నారు: భట్టి విక్రమార్క
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతు లేకండా రాజకీయ నాయకులను, ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ప్రశ్నించే గొంతు లేకుండా బెదిరిస్తున్నారు: భట్టి విక్రమార్క