తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండుగ - బతుకమ్మ పండుగ
మహోన్నతమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించటంలో బతుకమ్మ పండుగ నిలువటద్దంలా నిలుస్తోందని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో బతుకమ్మ కార్య కళాశాల నిర్వహించారు. జేఎన్ఏఎఫ్ఏ వర్సిటీలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యశాలలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే కళాఖండాలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో క్యూరేటర్ అనిత, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. మహోన్నతమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించటంలో బతుకమ్మ పండుగ నిలువటద్దంలా నిలుస్తోందని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి : లలిత త్రిపుర సుందరీదేవిగా అమ్మవారి దర్శనం