Bathukamma Festivals in Malaysia: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మలేషియాలో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తర్వాత ప్రవాస భారతీయులు ఘనంగా జరిపారు. దీనికి మలేషియాలో ఉన్న మన తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు.
మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. హాజరైన తెలంగాణ ప్రముఖులు - తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు
Bathukamma Celebrations in Malaysia: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడున్నా తీరొక్క పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మ చుట్టూ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడిపాడుతుంటారు. ఖండాంతరాలకు వ్యాపించిన ఈ పండుగ.. ఇప్పుడు మలేషియాలో ఉన్న మన తెలుగు వారు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా గౌరమ్మ చుట్టూ ఆడిపాడారు.
Bathukamma Festival
కార్యక్రమంలో పలువురు తెలంగాణ ప్రముఖుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి "మైట" తరఫున సహాయ సహకారాలు అందిస్తోన్న కోర్ కమిటీ సభ్యులను ప్రముఖులు అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: