హైదరాబాద్ చిక్కడపల్లిలోని సూర్య నగర్లో బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మహిళలు మాస్కులు ధరించి బతుకమ్మలు ఆడారు.
చిక్కడపల్లిలో బహుజన బతుకమ్మ వేడుకలు ప్రారంభం
కరోనా నేపథ్యంలో బతుకమ్మ వేడుకలను మహిళలు మాస్కులు ధరించి నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సూర్యనగర్లో బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో మహిళలు విభిన్న రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడారు.
చిక్కడపల్లిలో బహుజన బతుకమ్మ వేడుకలు ప్రారంభం
కరోనా నేపథ్యంలో ప్రధానంగా పౌష్టికాహార లోపం, ఉపాధి లేకపోవడము, దిగుమతి చేసుకున్న మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సమస్యలలతో ప్రజలు సతమతమవుతున్నారని అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన బతుకమ్మను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఇదీ చూడండి: అత్యాచారాలు అరికట్టాలని బతుకమ్మ ఆడిన సీతక్క