భారత రాజ్యాంగంపై పౌరులకు సంపూర్ణ అవగాహన ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో నవ తెలంగాణ అడ్వొకేట్స్ ఫోరమ్ ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.
పౌరులందరికీ రాజ్యాంగం తెలిసుండాలి: జస్టిస్ శ్రీదేవి - High Court Justice On Constitution Day
రాజ్యాంగంపై భారతీయులందరికీ అవగాహన ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి తెలిపారు. హైదరాబాద్ నవతెలంగాణ అడ్వొకేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
నవతెలంగాణ అడ్వొకేట్స్ ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన సదస్సు
భారత రాజ్యాంగమే ప్రజాస్వామ్య పరిరక్షణకు మూల స్తంభమని జస్టిస్ శ్రీదేవి అన్నారు. సామాజిక, ఆర్థిక, సాంఘిక న్యాయం కోసం... న్యాయవాదులు అంకిత భావం, స్వేచ్ఛ, నమ్మకంతో పని చేయాలని కోరారు. రాజ్యాంగ హక్కులను ప్రతీ పౌరుడు వినియోగించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
Last Updated : Nov 27, 2019, 7:30 AM IST
TAGGED:
HIGHJ COURT JUSTICE SRIDEVI