ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు - RTC WORKERS ON DUTY

సమస్యల పరిష్కారం కోసం 52 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించిన కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఉదయం నుంచే డిపోల వద్దకు తరలివచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి రానందున పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్ విధించి... మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పలు చోట్ల బస్సులు బయటకు పోకుండా అడ్డుకోవటం వల్ల ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేశారు. మేమేం తప్పు చేశాం.. ఎందుకు ఇంత శిక్ష అంటూ... ఆర్టీసీ కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు.

rtc-workers-on-duty-issues
ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు
author img

By

Published : Nov 26, 2019, 11:41 PM IST

Updated : Nov 27, 2019, 10:16 AM IST

ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు

విధుల్లో చేరతామంటూ కార్మికులు... అనుమతి లేదంటూ అధికారులు... పోలీసుల అరెస్టులతో ఆర్టీసీ డిపోలు అట్టుడుకుపోయాయి. తెల్లవారుజాము నుంచే డిపోల వద్దకు కార్మికులు చేరుకుంటుండగా... అడుగడుగునా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ... కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. తాత్కాలిక కార్మికులను ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాతే డిపోల్లోకి అనుమతించారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ బస్సులు యథావిధిగా రోడ్లెక్కాయి. ప్రతి ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డిపో పరిసరప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు.

కన్నీళ్లు పెట్టుకున్నా... కనికరించలేదు

తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకుండా ఉంటున్నామని... తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రాధేయపడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల చదువులకీ.. తల్లిదండ్రుల ఆసుపత్రుల ఖర్చులకి, ఇంటి కిరాయిలకు, కనీసం తినేందుకు బియ్యం కొనుగోలు చేసేందుకు కూడా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని దీనంగా అర్థించారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని చేతులెత్తి వేడుకున్నారు. ఎంతో ఆశతో డ్యూటీకి వచ్చిన తమకు నిరాశే ఎదురైందని మహిళా కార్మికులు కన్నీళ్లపర్యాంతమయ్యారు.

ముందస్తు అరెస్టులు అక్రమం

సోమవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డిపోల వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు.

సమ్మె చేసేందుకు నోటీసు ఇచ్చే హక్కు కార్మిక సంఘాలకు ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని, ప్రజా రవాణా వ్యవస్థను రక్షించుకునేందుకే సమ్మె నోటీసు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

ఇవీచూడండి: 'తక్షణమే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'

TG_HYG_68_26_RTC_WORKERS_ON_DUTY_ISSUES_PKG_3182388_3182301_3066407 reporter : sripathi. srinivas k.srinivas karteek ( ) విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మికులు..చేర్చుకోమని అధికారులు తేల్చి చెప్పడంతో ఇవాళ ఆర్టీసీ డిపోల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్టీసీ కార్మికులు డిపోల వద్దకు క్యూ కట్టారు. కానీ...డిపోల వద్ద భారీగా పోలీసులు ఉండడంతో పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. 52 రోజుల సుధీర్ఘ సమ్మెను విరమించి విధుల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే..అడ్డుకోవడమేంటని కార్మికులు ప్రశ్నించారు. మూడునెలలుగా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు..ఉద్యోగం చేసుకునేందుకు అనుమతించండని మహిళా కండక్టర్లు పలు డిపోల వద్ద చేతులెత్తి వేడుకున్నా...పోలీసులు కనికరించలేదు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేకపోవడంతో తామేమి చేయలేమని చెప్పడంతో మహిళా కార్మికులు కన్నీళ్లపర్యాంతమయ్యారు. Look వాయిస్ : ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నాం...కార్మికులు విధుల్లో చేరిపోండని చెప్పడంతో ఇవాళ మొదటి డ్యూటీ నుంచే కార్మికులు డిపోల వద్దకు వచ్చేశారు. కానీ...పూర్తిస్థాయి కార్మికులను పోలీసులు డిపోల్లోకి అనుమతించలేదు. ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి పూర్తిస్థాయి కార్మికులను విధుల్లోకి తీసుకునే విషయంలో ఎటువంటి ఆదేశాలు రాపకోవడంతో తాము పంపించలేమని స్పష్టం చేశారు. డిపోల పరిసర ప్రాంతాల్లో కన్పించిన కార్మికులను సైతం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించామని స్పష్టం చేశారు. ఇక..తాత్కాలిక కార్మికులను సైతం ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాతనే డిపోల్లోకి అనుమతించారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ బస్సులు యధావిధిగా రోడ్లెక్కాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహించారు. ప్రతి ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు భారీ భధ్రతను ఏర్పాటు చేశారు. బారీకేడ్లను, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. దీంతో డిపో పరిసరప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు. వాయిస్ : పలు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మను వేడుకున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకుండా ఉంటున్నామని..తమ తప్పును తాము తెలుసుకున్నామని...క్షమించమని ప్రాథేయపడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినప్పటికీ పోలీసులు కనికరించలేదు. పిల్లల చదువులకీ..తల్లిదండ్రుల ఆసుపత్రుల ఖర్చులకి, ఇంటి కిరాయిలకు, కనీసం తినేందుకు బియ్యం కొనుగోలు చేసేందుకు కూడా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని ధీనంగా అర్థించారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని చేతులెత్తి వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు తీసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎంతో ఆశతో డ్యూటీకి వచ్చిన తమకు నిరాశే ఎదురైందని మహిళా కార్మికులు కన్నీళ్లపర్యాంతమయ్యారు. బైట్ : ఆర్టీసీ కార్మికురాలు (బస్ భవన్ ముందు ఏడుస్తూ మాట్లాడిన మహిళ ఫీడ్ 3G నుంచి వచ్చింది వాడుకోగలరు). జిల్లాల నుంచి వచ్చిన బైట్లు కూడా వాడుకోగలరు. వాయిస్ : సోమవారం అర్థరాత్రి నుంచే ఆర్టీసీ జేఏసి ముఖ్యనేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని...డిపోల వద్దకు విధులు చేసేందుకు వచ్చేటువంటి కార్మికులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. అకారణంగా అరెస్ట్ చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. సమ్మె చేసేందుకు నోటీసు ఇచ్చే హక్కు కార్మిక సంఘాలకు ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామారెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని, ప్రజా రవాణా వ్యవస్థను రక్షించుకునేందుకే సమ్మె నోటీసు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. బైట్ అశ్వద్దామారెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్. (డెస్క్ వాట్స్ అప్ కు ఫీడ్ వచ్చింది చూసుకోగలరు). END.....
Last Updated : Nov 27, 2019, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.