AP HIGH COURT: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం వివాదంలో.. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని అశోక్‌గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రామతీర్థం ఘటన ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు.. రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ వివాదంపై పోలీసులు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు చేయంతో ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇదీ జరిగింది..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై బుధవారం కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కొండపై శంకుస్థాపన పూజలు చేసేందుకు నిర్ణయించారు. గజపతిరాజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఆలయ ధర్మకర్తగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందు చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయానికి ప్రభుత్వం ఎలా శిలాఫలకం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ఆనవాయితీకి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల మాదిరిగానే ప్రభుత్వం తనను కూడా వేధిస్తోందన్నారు.