ఏపీలో కొత్తగా 10,276 కరోనా కేసులు, 97 మరణాలు
17:58 August 22
ఏపీలో కొత్తగా 10,276 కరోనా కేసులు, 97 మరణాలు
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 61,469 నమూనాలను పరీక్షించగా వారిలో 10,276 మందికి ఈ వైరస్ సోకింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు నమోదు చేసిన వివరాలను అందులో పేర్కొంది. ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనాతో 97 మంది మృతి చెందారు.
చిత్తూరులో 13, అనంతపురం 11, నెల్లూరు 10, తూర్పుగోదావరి 8, కడప 8, కర్నూలు 8, గుంటూరు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, కృష్ణా 3, విజయనగరంలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 3,189కి చేరింది. 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో 31,91,326 పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.