Cause of Secunderabad fire accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అదనపు డీజీ సంజయ్ కుమార్ వెల్లడించారు. పొగ వల్లే ఎనిమిది మృతి చెందారని స్పష్టం చేశారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి కాస్త విషమంగా ఉందని.. మరికొందరు కోలుకుంటున్నారని తెలిపారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. కారణాలేంటంటే..?
Cause of Secunderabad fire accident : దట్టమైన పొగవల్లే సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారని అగ్నిమాపక అదనపు డీజీ సంజయ్ కుమార్ తెలిపారు. లాడ్జిలో ఉన్న స్ప్రింకర్లు మంటలు చెలరేగినప్పుడే తెరుచుకుంటాయని.. దట్టమైన పొగ వ్యాపించడంతో స్ప్రింకర్లు పనిచేయలేదని స్పష్టం చేశారు. లాడ్జి లోపలికి, బయటకు వెళ్లడానికి ఒకే మార్గం ఉండటం వల్ల ప్రమాద సమయంలో ఎవరూ బయటకు రాలేకపోయారని వెల్లడించారు.
reason for Secunderabad fire accident : రూబీప్రైడ్ భవనానికి 4 అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మరో అంతస్తు నిర్మించారు. సెల్లార్లో పార్కింగ్‌కు మాత్రమే అనుమతి. కానీ ఈ భవనంలో విద్యుత్తు వాహనాల విక్రయిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు స్ప్రింక్కర్లు పనిచేయలేదు. ఆ స్ప్రింకర్లు కేవలం మంటలు చెలరేగినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాయని.. నిన్నటి ఘటనలో దట్టమైన పొగ అలుముకోవడం వల్ల స్ప్రింకర్లు ఆన్ అవ్వలేదు. ఈ లాడ్జికి లోపలి, బయటికి వెళ్లడానికి ఒకే మార్గం ఉంది. దీనికారణంగా ప్రమాద సమయంలో ఎవరూ బయటికి రాలేకపోయారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీల నుంచి కిందకు దూకారు. ఈ సమయంలో కొందరు గాయపడ్డారు. అని అగ్నిమాపక అదనపు డీజీ సంజయ్ కుమార్ తెలిపారు.
- సంబంధిన కథనాలు :సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
- Secunderabad Fire Accident : సికింద్రాబాద్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం
Secunderabad fire accident latest updates : సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటికే ఏడుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.