తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2021, 12:21 AM IST

ETV Bharat / city

'దిల్లీలో రహస్య మంతనాలు..గల్లీలో దొంగ నాటకాలు'

ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ నిర్ణయానికి వచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంట్​లో వైకాపా మౌనం..రహస్య ఒప్పందంలో భాగమేనని ధ్వజమెత్తారు. దిల్లీలో రహస్య మంతనాలు చేసుకుంటూ..గల్లీలో దొంగనాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు.

acchennayudu-fire-on-ycp-over-vishaka-steel
'దిల్లీలో రహస్య మంతనాలు..గల్లీలో దొంగ నాటకాలు'

కేసుల మాఫీ, స్వార్థ రాజకీయాల కోసం సీఎం జగన్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పార్లమెంట్ వేదికగా బట్టబయలైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకర​ణ వైకాపాతో సంప్రదింపులు జరిపాకే జరిగిందని స్వయంగా కేంద్రమంత్రే చెప్పారన్నారు. ఇన్నాళ్లు ఆడిన డ్రామాలపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడే స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ నిర్ణయానికి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక పోస్కో ప్రతినిధులతో అర్ధరాత్రిళ్లు సమావేశాలు జరిపి వాటాలు పంచుకున్నారని విమర్శించారు. ఇప్పుడేమీ తెలియదన్నట్లు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంట్​లో వైకాపా మౌనం..రహస్య ఒప్పందంలో భాగమేనని ధ్వజమెత్తారు. దిల్లీలో రహస్య మంతనాలు చేసుకుంటూ..గల్లీలో దొంగనాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది చేసిన ప్రాణత్యాగాలు వైకాపాకు లెక్కలేదన్నారు. కార్మికుల జీవితాలను రోడ్డున పడేసి, విశాఖ జిల్లా ప్రజల భవిష్యత్​పై దెబ్బకొట్టారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని వైకాపాకు మంత్రి పదవులు ఎందుకన్నారు. సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చేతకానితనంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:భైంసా అల్లర్లపై పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఐజీ

ABOUT THE AUTHOR

...view details